NIGAMA MEDIA (P) LTD
12.3 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Tuesday, October 13, 2026

అధ్వానంగా రోడ్డు.. ప్రజల అవస్థలు పట్టించుకోరా?

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్(కాసిపేట):

రోడ్యాం నుంచి కాసిపేట హైస్కూల్ వరకు సుమారు 500 మీటర్ల మేర ఉన్న రహదారి గత నాలుగేళ్లుగా అధ్వాన స్థితిలో ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం నడవడానికి కూడా వీలులేని పరిస్థితి నెలకొన్నప్పటికీ ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ రహదారి నిర్మాణం చేపట్టాలని స్థానిక ప్రజలు పలుమార్లు ప్రజాప్రతినిధులకు, అధికారులకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని వారు పేర్కొన్నారు. కేవలం 500 మీటర్ల రహదారిని సైతం నిర్మించలేని దుస్థితి నెలకొందంటే ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించకుండా పదవులు, జీతాలు, కమీషన్లపైనే ప్రజాప్రతినిధులు, అధికారులు శ్రద్ధ చూపుతున్నట్లుగా ఉందని మండిపడ్డారు.

రహదారికి ఇరువైపులా నివసిస్తున్న కుటుంబాలు నిత్యం దుమ్ము, ధూళితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. దుమ్ము కారణంగా ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని, ఇప్పటికే కొంతమంది గుండె సంబంధిత సమస్యలు, ఆస్తమాతో బాధపడుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపిల్లలు సైతం దుమ్ము ధూళిని తట్టుకోలేకపోతున్నారని పేర్కొన్నారు.

ఈ రహదారిపై ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు తరచూ ప్రమాదాల బారిన పడుతూ ఆరోగ్యపరంగా, ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే రహదారి నిర్మాణ పనులు ప్రారంభించి, త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల, ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలని కోరారు. లేనిపక్షంలో దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సంకె రవి (CPI(AM) మంచిర్యాల జిల్లా కన్వీనర్), సోదారి సురేష్ (TRS మండల నాయకుడు), దుర్గం సుధాకర్ (CPI మండల సహాయ కార్యదర్శి), వార్డు సభ్యులు రాంబాబు, నిచ్చకోల్ల శంకర్, స్వామి, రత్నం సుధాకర్, సల్లూరి కిరణ్‌తో పాటు పలువురు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.