అధ్వానంగా రోడ్డు.. ప్రజల అవస్థలు పట్టించుకోరా?
కోల్ బెల్ట్ న్యూస్(కాసిపేట): రోడ్యాం నుంచి కాసిపేట హైస్కూల్ వరకు సుమారు 500 మీటర్ల మేర ఉన్న రహదారి గత నాలుగేళ్లుగా అధ్వాన స్థితిలో ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం నడవడానికి కూడా వీలులేని పరిస్థితి నెలకొన్నప్పటికీ ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రహదారి నిర్మాణం చేపట్టాలని స్థానిక ప్రజలు పలుమార్లు ప్రజాప్రతినిధులకు, అధికారులకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని వారు పేర్కొన్నారు. కేవలం 500 మీటర్ల రహదారిని సైతం...