NIGAMA MEDIA (P) LTD
12.3 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Tuesday, October 13, 2026

కామ్రేడ్ గుండా మల్లేష్‌కు సీపీఐ నాయకుల ఘన నివాళి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

కామ్రేడ్ గుండా మల్లేష్ ఆరో వర్ధంతిని పురస్కరించుకుని మందమర్రి పట్టణంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో సీపీఐ నాయకులు, కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి వనం సత్యనారాయణ మాట్లాడుతూ.. కామ్రేడ్ గుండా మల్లేష్ తన జీవితాన్ని పేదలు, కార్మికులు, కర్షకులు, అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం అంకితం చేసిన ప్రజా నాయకుడని కొనియాడారు. ఎర్రజెండా ఆశయాల సాధనతో పాటు శ్రమజీవుల విముక్తి కోసం ఆయన సాగించిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

కార్మిక వర్గ హక్కుల పరిరక్షణకు, పేద ప్రజలకు న్యాయం జరిగే వరకు నిరంతరం పోరాడటమే కామ్రేడ్ గుండా మల్లేష్‌కు అర్పించే నిజమైన నివాళి అని అన్నారు. నేటి సమాజంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, కార్మికుల సమస్యలు, పేద ప్రజల కష్టాలపై వామపక్ష శక్తులన్నీ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.