కామ్రేడ్ గుండా మల్లేష్‌కు సీపీఐ నాయకుల ఘన నివాళి

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): కామ్రేడ్ గుండా మల్లేష్ ఆరో వర్ధంతిని పురస్కరించుకుని మందమర్రి పట్టణంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో సీపీఐ నాయకులు, కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి వనం సత్యనారాయణ మాట్లాడుతూ.. కామ్రేడ్ గుండా మల్లేష్ తన జీవితాన్ని పేదలు, కార్మికులు, కర్షకులు, అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం అంకితం చేసిన ప్రజా నాయకుడని కొనియాడారు. ఎర్రజెండా ఆశయాల సాధనతో పాటు శ్రమజీవుల విముక్తి కోసం ఆయన సాగించిన పోరాటం నేటి తరానికి...