పట్టణంలోని రైల్వే స్టేషన్ చెరువు వద్ద ఏర్పాటు చేస్తున్న బతుకమ్మ ఘాట్‌ను ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ పైడిమల్ల నర్సింగ్, మందమర్రి పట్టణ అధ్యక్షుడు మంద తిరుమలరెడ్డి, మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు పరిశీలించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఘాట్ వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లు, ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలను వారు పరిశీలించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు మాట్లాడుతూ, బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఘాట్ వద్ద ప్రజలకు అవసరమైన ఏర్పాట్లు చేపడతామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మందమర్రి పట్టణంతో పాటు 15వ వార్డు శ్రీపతి నగర్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలు సంపత్, కుండే రామకృష్ణ, భోగి వెంకటేశ్వర్లు, శనిగరపు చంద్రయ్య, ఎనగందుల వెంకన్న, సమ్మయ్య, నాతారి నారాయణ తదితరులు పాల్గొన్నారు.