బతుకమ్మ వేడుకలకు వచ్చే ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం
మున్సిపల్ కమిషనర్ రాజలింగు కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): పట్టణంలోని రైల్వే స్టేషన్ చెరువు వద్ద ఏర్పాటు చేస్తున్న బతుకమ్మ ఘాట్‌ను ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ పైడిమల్ల నర్సింగ్, మందమర్రి పట్టణ అధ్యక్షుడు మంద తిరుమలరెడ్డి, మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు పరిశీలించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఘాట్ వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లు, ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు మాట్లాడుతూ, బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు...