NIGAMA MEDIA (P) LTD
11.5 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Friday, October 9, 2026

టీఆర్‌ఎస్‌లోకి ప్రముఖ న్యాయవాది కీర్తి రవికుమార్

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

అనుచరులతో కలిసి పార్టీలో చేరిన కీర్తి
అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని నేతల హామీ

కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి):

పెద్దపల్లి కి చెందిన ప్రముఖ న్యాయవాది కీర్తి రవికుమార్ తన అనుచరులతో కలిసి గురువారం టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు బాలాజీ రావు, పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ సమక్షంలో కీర్తి రవికుమార్‌తో పాటు సుమారు 30 మంది పార్టీలో చేరారు. వారికి నాయకులు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా బాలాజీ రావు, సలేంద్ర కొమురయ్య యాదవ్ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పార్టీ అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తోందన్నారు. పార్టీలో చేరుతున్న నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు, బాధ్యతలు కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రజల్లో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

రాజకీయంగా ప్రాధాన్యత:

పెద్దపల్లి నియోజకవర్గంలో కీర్తి రవికుమార్‌ వంటి ప్రముఖులు తమ అనుచరులతో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరడం పార్టీకి రాజకీయంగా మరింత బలం చేకూర్చే పరిణామంగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఉస్తం శ్రీనివాస్, బొంగొని శంకరయ్య, మేకల శ్రీనివాస్, ఎంచేర్ల స్వామి, మల్యాల కరుణాకర్, కలువల రవీందర్, కీర్తి రవికుమార్, కలువల తిరుపతి, చిరుమల్ల హనుమల్లు, గౌస్య బేగం, కలువల సరిత, అంజలి, కరిపాకల రాజేందర్, కరిపాకల రమేష్, బొడిగే మహేష్, ముంజ్యాల రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.