NIGAMA MEDIA (P) LTD
11.3 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Wednesday, October 7, 2026

ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు అండగా నిలిచిన రేణికుంట్ల ప్రవీణ్

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడిగా సేవలు అభినందనీయం

కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి):

రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడిగా మూడేళ్ల పదవీకాలంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు కృషి చేసిన రేణికుంట్ల ప్రవీణ్‌ను మాజీ మున్సిపల్ చైర్మన్ అమూరాజుల రాజేశ్వర్, సదయ్య, పద్మారావు తదితరులు కలిసి అభినందనలు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు అమలవుతున్న రిజర్వేషన్లు, పదోన్నతుల విధానాలను పరిశీలిస్తూ, వాటి అమలులో ఎదురవుతున్న సమస్యలపై రేణికుంట్ల ప్రవీణ్ స్పందించారని వారు పేర్కొన్నారు. ఆయా సంస్థల యాజమాన్యాల వేధింపులు, కక్ష సాధింపు చర్యల కారణంగా నష్టపోయిన ఉద్యోగులకు కమిషన్ ద్వారా న్యాయం జరిగేలా కృషి చేశారని కొనియాడారు.

బాధిత ఉద్యోగులకు అండగా నిలుస్తూ, వారికి భరోసా కల్పించి, తమకు న్యాయం జరుగుతుందనే ధైర్యాన్ని కల్పించడం అభినందనీయమన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతూ, తన పదవీకాలాన్ని సద్వినియోగం చేసుకున్న రేణికుంట్ల ప్రవీణ్ సేవలను వారు ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేసి, భవిష్యత్తులోనూ ప్రజలకు, ఉద్యోగులకు సేవలందించాలని ఆకాంక్షించారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.