NIGAMA MEDIA (P) LTD
11.7 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Tuesday, October 6, 2026

అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ఘన సన్మానం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా అంగన్వాడీ ఉత్సవాలు
సేవలు వెలకట్టలేనివన్న మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి

కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి):

బెల్లంపల్లి పట్టణ బీజేపీ అధ్యక్షురాలు దార కళ్యాణి ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అమురాజుల శ్రీదేవి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు, సేవా సంకల్ప్ అభియాన్ జిల్లా కన్వీనర్ పట్టి వెంకటకృష్ణ హాజరై అంగన్వాడీ టీచర్లు, ఆయాలను శాలువాలతో సత్కరించారు.

ఈ సందర్భంగా శ్రీదేవి, వెంకటకృష్ణ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా సేవకు ప్రతీకగా నిర్వహిస్తున్న **‘సేవా సంకల్ప్ అభియాన్’**లో భాగంగా సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 7 వరకు దేశవ్యాప్తంగా ‘అంగన్వాడీ ఉత్సవాలు’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమాజంలోని పసిపిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు గర్భిణీలు, బాలింతల ఆరోగ్య పరిరక్షణలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.

దేశ భవిష్యత్తు బాలల ఆరోగ్యం, పోషణపై ఆధారపడి ఉంటుందని అన్నారు. చిన్నారులకు పోషకాహారం, ప్రాథమిక విద్య అందిస్తూ వారిని భావి పౌరులుగా తీర్చిదిద్దడంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. కేంద్రాలకు వచ్చే ప్రతి చిన్నారిని ఇంటి వద్ద తల్లిదండ్రులు చూపించే ప్రేమ, ఆప్యాయతలకు ఏమాత్రం తీసిపోని విధంగా అంగన్వాడీ కార్యకర్తలు సంరక్షిస్తున్నారని అన్నారు. వారి సేవలు సమాజానికి ఎంతో విలువైనవని పేర్కొంటూ అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి రాచర్ల సంతోష్ కుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్, సీనియర్ నాయకులు దూది ప్రకాష్, జీదుల రాములు, యువ మోర్చా పట్టణ అధ్యక్షుడు తోటపల్లి ఓం సాయి, ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షుడు ఇప్ప స్వామి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.