NIGAMA MEDIA (P) LTD
16.8 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Tuesday, September 22, 2026

గనులు, డిపార్ట్‌మెంట్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా.
అధికారులకు వినతిపత్రాల సమర్పణ

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

మందమర్రి ఏరియాలోని వివిధ గనులు, డిపార్ట్‌మెంట్లలో నెలకొన్న సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, ఉపాధ్యక్షులు భీమనాధుని సుదర్శన్ డిమాండ్ చేశారు. సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మందమర్రి ఏరియాలోని గనులు, డిపార్ట్‌మెంట్ల వద్ద ధర్నా నిర్వహించి సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా సలేంద్ర సత్యనారాయణ, భీమనాధుని సుదర్శన్, కంది శ్రీనివాసులు మాట్లాడుతూ.. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి, కార్మికుల భద్రతకు అవసరమైన పనిముట్లను సకాలంలో అందించడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఉత్పత్తికి అవసరమైన డ్రిల్‌ రాడ్లు, బిట్లు, హ్యాండ్‌ బ్లోయర్లు, ఎలక్ట్రిషియన్లకు అవసరమైన ఫిల్టర్లు, నాణ్యమైన టూల్‌ కిట్లు అందించాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా గనులు, వివిధ డిపార్ట్‌మెంట్లలో ఖాళీగా ఉన్న పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలని కోరారు. ఆయా గనులు, డిపార్ట్‌మెంట్లలో ఉన్న ఇతర సమస్యలను కూడా వినతిపత్రాల ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. సమస్యలను తక్షణమే పరిష్కరించి కార్మికులకు మెరుగైన పని వాతావరణం కల్పించాలని యాజమాన్యాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో కేకేఓసీ పిట్ కార్యదర్శి కలవల శ్రీనివాస్, కేకే-5 గని పిట్ నాయకుడు గాండ్ల సంపత్, కాసిపేట-1 గని పిట్ నాయకుడు వడ్లమల్ల రాజేందర్, కాసిపేట-2 గని పిట్ నాయకుడు కల్వల శ్రీనివాస్, శాంతిఖని గని పిట్ నాయకుడు రమేష్, జనరల్ మేనేజర్ కార్యాలయంలో సృజన గీతిక, ఎస్‌అండ్‌పీసీ డిపార్ట్‌మెంట్‌లో పారిపెల్లి సంజీవ్, ఏరియా వర్క్‌షాప్‌లో సీహెచ్‌పీ శర్మ, సివిల్ డిపార్ట్‌మెంట్‌లో కలవల శ్రీనివాస్ తదితరులు పాల్గొని తమ పరిధిలోని సమస్యలపై ధర్నాలు నిర్వహించి అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు.

ఏరియా నాయకులు సోమిశెట్టి రాజేశం, పెద్దపల్లి బానయ్య, గోపతి సత్యనారాయణ, ఎక్కేటి రాజేశ్వర్‌రావు, వర్క్‌మెన్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు, తోట వెంకటస్వామి, విక్రమ్‌సింగ్, సేఫ్టీ కమిటీ, పిట్ కమిటీ సభ్యులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.