గనులు, డిపార్ట్‌మెంట్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా. అధికారులకు వినతిపత్రాల సమర్పణ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మందమర్రి ఏరియాలోని వివిధ గనులు, డిపార్ట్‌మెంట్లలో నెలకొన్న సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, ఉపాధ్యక్షులు భీమనాధుని సుదర్శన్ డిమాండ్ చేశారు. సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మందమర్రి ఏరియాలోని గనులు, డిపార్ట్‌మెంట్ల వద్ద ధర్నా నిర్వహించి సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా సలేంద్ర సత్యనారాయణ, భీమనాధుని సుదర్శన్, కంది శ్రీనివాసులు మాట్లాడుతూ.. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి, కార్మికుల భద్రతకు అవసరమైన పనిముట్లను సకాలంలో...