కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
సింగరేణి సూపర్ బజార్ (ఎల్పీజీ) ద్వారా వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తున్న సిబ్బందిని మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ అభినందించారు. బుధవారం మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో సింగరేణి సూపర్ బజార్ డివిజనల్ మేనేజర్ పాలకుర్తి రాజుతో పాటు సిబ్బందిని జీఎం రాధాకృష్ణ సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సూపర్ బజార్ ద్వారా ఇండియన్ ఆయిల్ ఎల్పీజీ సేవలను పారదర్శకంగా, సమర్థవంతంగా అందించడంలో పాలకుర్తి రాజు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.
ఆయన సేవలను గుర్తించిన ఇండియన్ ఆయిల్ ఎల్పీజీ కార్పొరేషన్ హెడ్ ఆఫీస్ ప్రత్యేకంగా డివిజనల్ మేనేజర్ పాలకుర్తి రాజును సత్కరించి అభినందించినట్లు జీఎం తెలిపారు. రామకృష్ణాపూర్, బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ ప్రాంతాల్లో నాణ్యమైన ఎల్పీజీ గ్యాస్ సేవలను అందిస్తూ వినియోగదారుల నమ్మకాన్ని సిబ్బంది పొందుతున్నారని ఆయన కొనియాడారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించాలని జీఎం రాధాకృష్ణ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీజీఎం (పర్సనల్) అశోక్, సూపర్ బజార్ బ్రాంచ్ మేనేజర్ సుదర్శన్, సూపర్ బజార్ కోఆర్డినేటర్ భూపతి శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.

