సింగరేణి సూపర్ బజార్ ఎల్పీజీ సిబ్బందికి జీఎం అభినందనలు

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సింగరేణి సూపర్ బజార్ (ఎల్పీజీ) ద్వారా వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తున్న సిబ్బందిని మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ అభినందించారు. బుధవారం మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో సింగరేణి సూపర్ బజార్ డివిజనల్ మేనేజర్ పాలకుర్తి రాజుతో పాటు సిబ్బందిని జీఎం రాధాకృష్ణ సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సూపర్ బజార్ ద్వారా ఇండియన్ ఆయిల్ ఎల్పీజీ సేవలను పారదర్శకంగా, సమర్థవంతంగా అందించడంలో పాలకుర్తి రాజు కీలక పాత్ర పోషించారని...