NIGAMA MEDIA (P) LTD
16.8 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, August 30, 2026

ఉప్పరపల్లి–బీబీపేట రహదారికి మరమ్మతులు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):

కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలోని ఉప్పరపల్లి, బీబీపేట గ్రామాల మధ్య చెరువు కట్ట కింద ఉన్న రహదారి కొంతకాలంగా గుంతలమయంగా మారి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగించింది. రహదారి అధ్వానంగా ఉండటంతో వాహనదారులు, గ్రామస్థులు నిత్యం అవస్థలు పడుతున్నారు.

ఈ సమస్యను పరిష్కరించాలంటూ మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ నర్సింలు పలుమార్లు పత్రికల ద్వారా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పత్రికల్లో వరుసగా ప్రచురితమైన కథనాలకు స్పందించిన అధికారులు రహదారిలోని గుంతలను పూడ్చి మరమ్మతులు చేపట్టారు.

గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ సిబ్బంది సమన్వయంతో రహదారి మరమ్మతులు చేపట్టడంపై ఉప్పరపల్లి గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం చర్యలు తీసుకున్న గ్రామపంచాయతీ పాలకవర్గానికి, సిబ్బందికి గ్రామస్థుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ నర్సింలు మాట్లాడుతూ.. పత్రికల్లో సమస్యను పలుమార్లు ప్రచురించడం వల్ల రహదారి సమస్యలో ఒకటి పరిష్కారమైందన్నారు. అయితే గ్రామంలో ఇంకా పలు సమస్యలు ఉన్నాయని, వాటిని కూడా ప్రభుత్వం, సంబంధిత అధికారులు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యే వరకు కృషి చేస్తామని తెలిపారు

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.