ఉప్పరపల్లి–బీబీపేట రహదారికి మరమ్మతులు

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలోని ఉప్పరపల్లి, బీబీపేట గ్రామాల మధ్య చెరువు కట్ట కింద ఉన్న రహదారి కొంతకాలంగా గుంతలమయంగా మారి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగించింది. రహదారి అధ్వానంగా ఉండటంతో వాహనదారులు, గ్రామస్థులు నిత్యం అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలంటూ మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ నర్సింలు పలుమార్లు పత్రికల ద్వారా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పత్రికల్లో వరుసగా ప్రచురితమైన కథనాలకు స్పందించిన అధికారులు రహదారిలోని గుంతలను పూడ్చి మరమ్మతులు చేపట్టారు. గ్రామ సర్పంచ్, ఉప...