బీబీపేట టౌన్‌లో హిందూ సాంప్రదాయ పద్ధతిలో వేడుకలు
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
రాఖీ పండుగ సందర్భంగా కామారెడ్డి జిల్లా బీబీపేట టౌన్‌లో అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల మధ్య ఆత్మీయత వెల్లివిరిసింది. పండుగను పురస్కరించుకుని పలువురు అక్కాచెల్లెళ్లు తమ సోదరులకు రాఖీలు కట్టి ప్రేమానురాగాలను చాటుకున్నారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ భర్త నర్సింలు మాట్లాడుతూ.. రాఖీ పండుగ మన హిందూ సంప్రదాయంలో అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉన్న అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. పండుగ సందర్భంగా ఆడపడుచులను ఇంటికి ఆహ్వానించి సంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టి, చీర అందించి, సోదర ప్రేమకు గుర్తుగా కానుకలు ఇవ్వడం జరిగిందన్నారు.
ప్రతి సంవత్సరం రాఖీ పండుగను ఇదే విధంగా కుటుంబ సభ్యులు, ఆడపడుచులతో కలిసి ఆనందంగా జరుపుకుంటున్నామని తెలిపారు. కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేసే ఇటువంటి పండుగలను సంప్రదాయాలను కాపాడుతూ భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, ఆడపడుచులు పాల్గొని రాఖీ పండుగను సంతోషంగా జరుపుకున్నారు.

