ఆడపడుచులకు ఆత్మీయంగా రాఖీ పండుగ వేడుకలు
బీబీపేట టౌన్‌లో హిందూ సాంప్రదాయ పద్ధతిలో వేడుకలు కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): రాఖీ పండుగ సందర్భంగా కామారెడ్డి జిల్లా బీబీపేట టౌన్‌లో అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల మధ్య ఆత్మీయత వెల్లివిరిసింది. పండుగను పురస్కరించుకుని పలువురు అక్కాచెల్లెళ్లు తమ సోదరులకు రాఖీలు కట్టి ప్రేమానురాగాలను చాటుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ భర్త నర్సింలు మాట్లాడుతూ.. రాఖీ పండుగ మన హిందూ సంప్రదాయంలో అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉన్న అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. పండుగ సందర్భంగా ఆడపడుచులను ఇంటికి ఆహ్వానించి సంప్రదాయబద్ధంగా బొట్టు...