కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
వానాకాలం సీజన్‌లో సన్న రకం వరి సాగు చేసే రైతులు ప్రభుత్వం సూచించిన ఏడు సన్న రకాలనే సాగు చేయాలని వ్యవసాయ శాఖ సూచించింది. ప్రభుత్వం నిర్దేశించిన ఈ ఏడు రకాలు మాత్రమే సన్న వరి బోనస్‌కు అర్హత పొందుతాయని అధికారులు తెలిపారు. బోనస్‌కు అర్హత పొందేందుకు రైతులు తాము విత్తనాలు కొనుగోలు చేసిన సంబంధిత డీలర్ షాపుకు వెళ్లి ఆన్‌లైన్‌లో తమ వివరాలను నమోదు చేయించుకోవాలి. ఇందుకోసం విత్తనాలు కొనుగోలు చేసిన రసీదు, పట్టా పాస్‌బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ వెంట తీసుకెళ్లాలని సూచించారు.
అదేవిధంగా రైతులు తమ స్వంతంగా పండించిన విత్తనాలను తిరిగి సాగుకు ఉపయోగించినట్లయితే, బీబీపేట రైతువేదికకు వెళ్లి స్వీయ ధ్రువీకరణ పత్రం (Self Declaration Form) సమర్పించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ రెండు ప్రక్రియల్లో ఏదో ఒకటి సంబంధిత విధానం ప్రకారం ఆగస్టు 30వ తేదీలోపు పూర్తి చేసుకున్న రైతులకే వానాకాలం సీజన్‌కు సంబంధించిన సన్న వరి బోనస్‌కు అర్హత ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా బీబీపేట రైతువేదికలో ఏఈఓ రాఘవేంద్ర మండల రైతులకు సన్న రకాల వరి సాగు, బోనస్‌కు అర్హత పొందేందుకు చేపట్టాల్సిన నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు. రైతులు గడువులోగా తమ వివరాలను నమోదు చేసుకొని ప్రభుత్వ ప్రోత్సాహకాన్ని పొందాలని ఆయన సూచించారు.

