NIGAMA MEDIA (P) LTD
29 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Thursday, August 13, 2026

ప్రజాస్వామ్య పరిరక్షణే సీపీఐ లక్ష్యం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్

కోల్ బెల్ట్ న్యూస్ (మందమర్రి):

కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యవంతం చేయడమే సీపీఐ లక్ష్యమని ఆ పార్టీ మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ అన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి 14 వరకు నిర్వహిస్తున్న ప్రజా చైతన్య ప్రచార జాతా మంగళవారం ఐదో రోజుకు చేరుకుంది. మందమర్రి మండలంలోని సారంగపల్లి, పొన్నారం, ఆదిల్‌పేట్, చిర్రకుంట, సండ్రోన్‌పల్లి, తుర్కపల్లి గ్రామాల్లో జాతా నిర్వహించి ప్రజలను ఉద్దేశించి లక్ష్మణ్ మాట్లాడారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఈవీఎంల వినియోగంపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పేపర్ బ్యాలెట్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. నిరుద్యోగం, రైతులకు గిట్టుబాటు ధరల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రజలను చైతన్యవంతం చేయడమే జాతా ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమానికి సీపీఐ మందమర్రి మండల కార్యదర్శి వనం సత్యం నాయకత్వం వహించారు. జిల్లా కార్యవర్గ సభ్యుడు ఇప్పక్కాయల లింగయ్య, చెన్నూరు నియోజకవర్గ కార్యదర్శి మిట్టపల్లి పౌలు, నాయకులు కాదండి సాంబయ్య, మామిడి గోపి, నక్క వెంకటస్వామి, రాంపెళ్లి రాజయ్య, తాళ్లపల్లి వీరయ్య, రోడ్డ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.