ప్రజాస్వామ్య పరిరక్షణే సీపీఐ లక్ష్యం
సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ కోల్ బెల్ట్ న్యూస్ (మందమర్రి): కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యవంతం చేయడమే సీపీఐ లక్ష్యమని ఆ పార్టీ మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ అన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి 14 వరకు నిర్వహిస్తున్న ప్రజా చైతన్య ప్రచార జాతా మంగళవారం ఐదో రోజుకు చేరుకుంది. మందమర్రి మండలంలోని సారంగపల్లి, పొన్నారం, ఆదిల్‌పేట్, చిర్రకుంట, సండ్రోన్‌పల్లి, తుర్కపల్లి గ్రామాల్లో జాతా నిర్వహించి ప్రజలను ఉద్దేశించి లక్ష్మణ్ మాట్లాడారు...