NIGAMA MEDIA (P) LTD
15 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Saturday, August 8, 2026

మందమర్రిలో సాంస్కృతిక వేడుకలు విజయవంతం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి);

మందమర్రి సింగరేణి ఆధ్వర్యంలో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ నిర్వహించిన రెండు రోజుల సాంస్కృతిక నాటకోత్సవాలు విజయవంతంగా ముగిశాయి. చివరి రోజు ప్రదర్శించిన “సత్యశోధన” జ్యోతిరావు ఫూలే–సావిత్రిబాయి ఫూలే జీవిత చరిత్ర ఆధారిత నాటకం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో మందమర్రి ఏరియా డీజీఎం (పర్సనల్) సి.హెచ్. అశోక్ జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి నాటక ప్రదర్శనను ప్రారంభించారు.

రెండు రోజుల పాటు ప్రదర్శించిన సామాజిక చైతన్య నాటకాలు మందమర్రి పట్టణ ప్రజలు, సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులను విశేషంగా అలరించాయి. సమాజానికి సందేశాత్మకంగా ఉన్న ఈ నాటకాలను విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, యూనియన్ నాయకులు, కళాకారులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ క్రాంతికుమార్, మంచిర్యాల ఎస్సీ లైజన్ అధికారి ఏ. చంద్రమౌళి, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సత్యనారాయణ, యూనియన్ నాయకులు, ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.