మందమర్రిలో సాంస్కృతిక వేడుకలు విజయవంతం
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి); మందమర్రి సింగరేణి ఆధ్వర్యంలో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ నిర్వహించిన రెండు రోజుల సాంస్కృతిక నాటకోత్సవాలు విజయవంతంగా ముగిశాయి. చివరి రోజు ప్రదర్శించిన "సత్యశోధన" జ్యోతిరావు ఫూలే–సావిత్రిబాయి ఫూలే జీవిత చరిత్ర ఆధారిత నాటకం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో మందమర్రి ఏరియా డీజీఎం (పర్సనల్) సి.హెచ్. అశోక్ జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి నాటక ప్రదర్శనను ప్రారంభించారు. రెండు రోజుల పాటు ప్రదర్శించిన సామాజిక చైతన్య నాటకాలు మందమర్రి పట్టణ ప్రజలు,...