NIGAMA MEDIA (P) LTD
23.7 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

బీబీపేట్ చేనేత సహకార సంఘం పాలకవర్గం ఏకగ్రీవం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

డైరెక్టర్లు, పాలకవర్గం ఏకగ్రీవం
నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జులై 21

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):

బీబీపేట్ మండలంలోని చేనేత సహకార వస్త్రోత్పత్తి విక్రయ సంఘం లిమిటెడ్ ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. ఈ నెల 10వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా, సంఘ పరిధిలోని బీబీపేట్, మల్కాపూర్, జనగామ, మాందాపూర్, పెద్దమల్లారెడ్డి, కాచాపూర్, కంచర్ల గ్రామాలకు చెందిన సభ్యులు ఎన్నికల్లో పాల్గొన్నారు.

సంఘానికి మొత్తం 16 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, వారిలో 9 మంది డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం జరిగిన డైరెక్టర్ల సమావేశంలో పాలకవర్గాన్ని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

సంఘం అధ్యక్షుడిగా అల్వాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా తుమ్మ మచ్చేందర్, ఉపాధ్యక్షుడిగా తుమ్మ రవీందర్, కోశాధికారిగా శివరాత్రి రామచంద్రం ఎన్నికయ్యారు. డైరెక్టర్లుగా కన్నా లక్ష్మి, మేరుగు శారద, ఓల్లేల దేవేందర్, గడీల మారుతి, శర్భాని సంతోష్ ఎన్నికైనట్లు ప్రకటించారు. కొత్తగా ఎన్నికైన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్షుడు అల్వాల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.