బీబీపేట్ చేనేత సహకార సంఘం పాలకవర్గం ఏకగ్రీవం

డైరెక్టర్లు, పాలకవర్గం ఏకగ్రీవం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జులై 21 కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): బీబీపేట్ మండలంలోని చేనేత సహకార వస్త్రోత్పత్తి విక్రయ సంఘం లిమిటెడ్ ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. ఈ నెల 10వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా, సంఘ పరిధిలోని బీబీపేట్, మల్కాపూర్, జనగామ, మాందాపూర్, పెద్దమల్లారెడ్డి, కాచాపూర్, కంచర్ల గ్రామాలకు చెందిన సభ్యులు ఎన్నికల్లో పాల్గొన్నారు. సంఘానికి మొత్తం 16 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, వారిలో 9 మంది డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు....