Home » వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ఉదయ–ఆస్తమాన సేవ కార్యక్రమం

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ఉదయ–ఆస్తమాన సేవ కార్యక్రమం

కోల్ బెల్ట్ న్యూస్ (కామారెడ్డి):

వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశానుసారం వాసవి క్లబ్ కామారెడ్డి గ్రేటర్ ఆధ్వర్యంలో ఉగ్రవాయిలోని ప్రేమ సాయి మందిరం ఆవరణలో ఆదివారం ఉదయ–ఆస్తమాన సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు తమ కుటుంబ సభ్యులతో కలిసి గోపూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్లకు ట్రీ గార్డులు ఏర్పాటు చేశారు. అలాగే నూతన సభ్యత్వ నమోదు, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే హెల్ప్‌లైన్ నంబర్ల జాబితా పంపిణీ తదితర సేవా కార్యక్రమాలను చేపట్టారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అకిరాల శ్రీనివాస్ హాజరుకాగా, వైస్ గవర్నర్ భాశెట్టి నాగేశ్వర్, రీజన్ చైర్మన్ మోటూరు శ్రీకాంత్, జోన్ చైర్మన్ శ్రీధర్, వాసవి క్లబ్ కామారెడ్డి గ్రేటర్ అధ్యక్షుడు చింతగాని శ్రీనివాస్, కార్యదర్శి సునీల్, కోశాధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.

అదేవిధంగా మాజీ కార్యకర్తలు పబ్బ జగన్నాథం, చీల భాస్కర్, బోడ్ల వేణుగోపాల్, గంజి సతీష్, మేడం శ్రీనివాస్, దోమకొండ శ్రీనివాస్, ఎర్రం శ్రీనివాస్తో పాటు వాసవి మహిళా సభ్యులు, క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *