వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ఉదయ–ఆస్తమాన సేవ కార్యక్రమం
కోల్ బెల్ట్ న్యూస్ (కామారెడ్డి): వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశానుసారం వాసవి క్లబ్ కామారెడ్డి గ్రేటర్ ఆధ్వర్యంలో ఉగ్రవాయిలోని ప్రేమ సాయి మందిరం ఆవరణలో ఆదివారం ఉదయ–ఆస్తమాన సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు తమ కుటుంబ సభ్యులతో కలిసి గోపూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్లకు ట్రీ గార్డులు ఏర్పాటు చేశారు. అలాగే నూతన సభ్యత్వ నమోదు, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే హెల్ప్‌లైన్ నంబర్ల జాబితా పంపిణీ తదితర సేవా...