Home » Tongue : నాలుకపై మచ్చలు ఉంటే ఏం జరుగుతుంది ?

Tongue : నాలుకపై మచ్చలు ఉంటే ఏం జరుగుతుంది ?

Tongue : నరంలేని నాలుక ఏం మాట్లాడినా చెల్లుతుందంటారు. కానీ నాలుకపై మచ్చలు ఉన్నవారు ఏం మాట్లాడితే ఏమవుతుంది. మంచి జరుగుతుందా ? చెడు జరుగుతుందా ? వాస్తవం ఎంత ? వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం…..

వేద పండితులు, శాస్త్రం లో చెప్పబడిన ప్రకారం ఈ విధంగా ఉంది. నాలుకపై మచ్చలు ఏర్పడటానికి కారణం ఏమిటంటే పూర్వ జన్మలో పుణ్యం చేసుకున్నవారికి ఈ మచ్చలు ఏర్పడుతాయంటారు. అటువంటి వారి నాలుకపై ఒక దివ్యమైన శక్తి ఉంటుంది. దీనినే వాక్ శుద్ధి అంటారు. అంటే నాలుకపై మచ్చలు ఉన్న వారు మాట్లాడితే మంచి, చెడు జరుగుతాయంటారు. అటువంటి వారు ఆశీర్వదిస్తే మేలు జరుగుతుందని వేద పండితులు చెబుతున్నారు.

సాముద్రిక శాస్త్రంలో కూడా మరో విధంగా చెప్పబడింది. మచ్చలు రెండు రకాలు ఉంటాయి. నాలుకకు ఎగువ, దిగువ భాగంలో మచ్చలు ఉంటాయి. దిగువ భాగంలో మచ్చలు ఉన్నవారు మంచి భోజన ప్రియులుగా చెప్పబడింది. కళా నైపుణ్యం కూడా మంచి ప్రతిభ చాటుతారు.

నాలుకపై మచ్చలు ఉన్నవారు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని వేద పండితులు చెబుతున్నారు. ఎందుకంటే వారు మాట్లాడిన మాటలు నిజమవుతాయంటున్నారు. అందుకే మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. కానీ నాలుకపై మచ్చలు ఉన్నవారు మాత్రం చాలా మంది భయపడుతుంటారు. ఏం మాట్లాడితే ఏమి జరుగుతుందోనని ఆందోళన చెందుతారు. కానీ కొన్ని సమయాల్లో మాత్రం మంచి, చెడులల్లో ఏదయినా జరుగవచ్చు, జరుగకపోవచ్చని వేద పండితులు చెబుతున్నారు.

Author

  • Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *