NIGAMA MEDIA (P) LTD
21.4 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Saturday, September 12, 2026

Mandamarri : మందమర్రిలో బస్తీ మే సవాల్

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కాంగ్రెస్ X బిఆర్ఎస్
అభివృద్ధి పై చర్చకు సవాల్ విసురుకున్న ఇరు పార్టీలు
నియోజక వర్గం అభివృద్ధి పై ప్రధాన చర్చ

Mandamarri : మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలోని మందమర్రి పట్టణం బస్తీమే సవాల్ కు వేదికయింది. నియోజక వర్గం అభివృద్ధి పై కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు చర్చకు సవాల్ విసురుకున్నాయి. ముందుగా కాంగ్రెస్ నేత సవాల్ విసరగా అందుకు బిఆర్ఎస్ నేతలు కూడా చర్చకు సిద్దమైనట్టుగా శనివారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఫిబ్రవరి 1న తాము చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటిస్తూ సవాల్ విసిరారు.

అభివృద్ధి అంటే మురికి కాలువలు కట్టించడం, కాలనీల్లో రోడ్లు వేయడం, అక్కడక్కడ వాగులపై వంతెనలు కడితేనే సరిపోదు. పరిపాలన పరంగా గెలిచిన ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ అందుబాటులో ఉండాలి. రవాణా వ్యవస్థ కావాలి. విద్య, వైద్య తప్పనిసరి. రైతులకు మార్కెట్ సౌకర్యం కావలి. ఇవేవి కూడా 2004 నుంచి చెన్నూర్ నియోజకవర్గం ప్రజలకు అందని ద్రాక్ష పల్లే కావడం విశేషం.

2004 నుంచి 2023 వరకు కాంగ్రెస్ పార్టీ తో పాటు బిఆర్ఎస్ కూడా మందమర్రి మున్సిపాల్టీ ఎన్నికలను పావులా వాడుకుంటున్నాయి. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి కార్మిక మంత్రిగా భాద్యతలు చేపట్టిన వినోద్ కూడా మున్సిపల్ ఎన్నికలపై హామీ ఇచ్చారు. ఆ సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉంది. అప్పడు కాంగ్రెస్ పార్టీ మందమర్రి మున్సిపల్ ఎన్నికలపై ఎందుకు స్పందించలేదనేది మందమర్రి వాసుల ప్రశ్న. ఆ తరువాత బాల్క సుమన్ ఎంపి గా ఉన్నారు. అప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఆ సమయంలో కూడా కేసీఆర్ మందమర్రి మున్సిపల్ ఎన్నికలపై హామీ ఇవ్వడం జరిగింది. కేసీఆర్ ఇచ్చిన హామీ కూడా సభకే పరిమితమైనది. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి 2023 ఎన్నికల వరకు కూడా మందమర్రి సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే సామెతను మరిపిస్తోంది.

సభల్లో మాది రైతు ప్రభుత్వం అంటారు. మామిడి పంటను అమ్ముకోవాలంటే రైతులు జగిత్యాల లేదా నాగపూర్ వెళ్ళాలి. కాళేశ్వరం తో చెన్నూర్ నియోజకవర్గం రైతులకు ఒరిగింది ఏమిటి. గోదావరి ఇసుకను వ్యాపారంగా మలచుకొని నాయకులు జేబులు నింపుకున్నది వాస్తవం కాదా అంటున్నారు ప్రజలు. కోటపల్లి మండలంలో మిర్చి పండిస్తున్న రైతుల కష్టాలు పట్టించుకోరు.

రవాణా వ్యవస్థ గురించి 2004 నుంచి కూడా రెండు పార్టీలు కూడా పట్టించుకున్న పరిస్థితి ఏ కోశానా కనబడుట లేదు. మందమర్రి రైల్వే స్టేషన్ లో ఎన్ని రైళ్లు ఆగుతున్నవి. పక్కనున్న రామకృష్ణాపూర్ లో ఎన్ని రైళ్లు ఆగుతున్నవి. మందమర్రి స్టేషన్ ప్రయాణికులకు ఎంత సౌకర్యంగా ఉంది. రామకృష్ణాపూర్ స్టేషన్ ఏ విధంగా అభివృద్ధి చెందింది. సింగరేణి ప్రాంతమైన మందమర్రి లో సింగరేణి రైల్ ఆగదు. కానీ రామకృష్ణా పూర్ లో ఆగుతుంది. ఇదేనా మీరు చేసిన రైల్వే రవాణా అభివృద్ధి అంటున్నారు పట్టణ వాసులు. ఇందులో మీ రెండు పార్టీల పట్టుదల ఏ మేరకు ఉందని ప్రశ్నిస్తున్నారు.

రెండు పార్టీల నాయకులు ఈ విషయంలో కూడా విఫలమైనారంటున్నారు స్థానికులు. బెల్లంపల్లి, లక్సెట్టిపేట బస్ స్టాండ్ లు రెండు కూడా మంచిర్యాల జిల్లాలో ఉన్న విషయం రెండు పార్టీల నాయకులకు తెలిసిందే. ఆ రెండు బస్ స్టాండ్ ల వద్దకు ఆర్టీసీ బస్సులు వెళుతున్న విషయం కూడా రెండు పార్టీల నాయకులకు తెలుసు. అటువంటప్పుడు మందమర్రి బస్ స్టాండ్ కు బస్సులు ఎందుకు రావడం లేదో రెండు పార్టీల నాయకులు సమాధానం చెప్పాలంటున్నారు స్థానికులు. అంతే కాదు ఒక్కసారి ఆర్టీసీ బస్సులో ఎమ్మెల్యేలు వినోద్, ప్రేమ్ సాగర్ రావు, మంత్రి వివేక్ తో పాటు మాజీ ఎమ్మెల్యేలు సుమన్, చిన్నయ్య, దివాకర్ రావు లను వేములవాడ కు పోయి తిరిగి వస్తే వేములవాడ వెళ్లే భక్తుల కష్టాలు ఏమిటో తెలుస్తాయంటున్నారు జిల్లా ప్రజలు. ఈ విషయాన్ని ఎందుకు చేర్చాల్సి వచ్చిందంటే, ప్రధాన పుణ్యక్షేత్రమైన వేములవాడకే మంచిర్యాల డిపో నుంచి బస్సు లేదంటే, ఇక మందమర్రి నుంచి బస్సు సౌకర్యాన్ని నాయకులు ఏర్పాటు చేస్తారా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

వైద్యం సౌకర్యంలో కూడా నాయకులు విఫలమైనారనే అభిప్రాయాలు సర్వత్రా ఉన్నాయి. మందమర్రిలో ఉన్న 4800 మంది కార్మికులకు వైద్యం సింగరేణి అందిస్తుంది. మిగతా 35 వేల పైన ఉన్న పట్టణ వాసులకు వైద్యం ఎవరు అందించాలి. కుటుంబంలో ఒకరు ఏదేని కారణంతో చనిపోతే మంచిర్యాలకు పోస్టుమార్టం కోసం శవాన్ని మోసుకెళ్లాల్సిందే. సమయం దాటితే తెల్లవార్లూ ఏడుస్తూనే గడపాలి. ప్రస్తుతం ఉన్న ఆసుపత్రిలో వైద్య సౌకర్యం పెంచాల్సిన సోయి కూడా లేకపాయె అంటున్నారు స్థానికులు.

సవాల్ విసురుకున్నది మందమర్రి నాయకులే కాబట్టి వీటిపై కూడా రెండు పార్టీల నాయకులు సమాధానం చెప్పాలంటున్నారు పట్టణ వాసులు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.