NIGAMA MEDIA (P) LTD
17.7 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Thursday, September 10, 2026

Political : ఆ ఇద్దరి లక్ష్యం హరీష్ రావు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Political : సీఎం రేవంత్ రెడ్డి రాజకీయంగా మాజీ మంత్రి హరీష్ రావును లక్ష్యంగా చేసుకొన్నారు. మరోవైపు ఎమ్మెల్సి కవితకు బంధువు అయినప్పటికీ హరీష్ రావును వదలకుండా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆ ఇద్దరి లక్ష్యం హరీష్ రావు కావడంతో రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

కవితను పార్టీ నుంచి బహిష్కరించిన నాటి నుంచి హరీష్ రావు తో పాటు కేటీఆర్ ను కూడా లక్ష్యంగా పెట్టుకొని ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. గత రెండు రోజుల కిందట హరీష్ రావు పైన గట్టిగానే విమర్శలు గుప్పించారు. పార్టీలో ఉన్నప్పుడు అవినీతి విషయాలు తెలిసి ఉరుకున్నారా ? లేదంటే తెలియలేదా ? ఒకవేళ తెలిసినా అవకాశం వచ్చినప్పుడు బహిర్గతం చేద్దామనే ఉద్దేశంతో ఇన్నేళ్లు మౌనంగా ఉన్నారా ? అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. కవిత ఎన్ని ఆరోపణలు చేసినప్పటికీ హరీష్ రావు మాత్రం స్పందించక పోవడంపై కూడా అనుమానాలు అటు పార్టీ శ్రేణులతో పాటు, రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

ఇది ఇలా ఉండగా గ్రామ పంచాయితీ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి కాస్త గట్టిగానే మాట్లాడారు. కేటీఆర్ ఎన్నికల భాద్యతలు చేపట్టిన నాటి నుంచి పార్లమెంట్, అసెంబ్లీ ఉపఎన్నికలు, గ్రామపంచాయితీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి చెందుతున్నారని అన్నారు. దీన్ని అవకాశంగా తీసుకొని హరీష్ రావు పార్టీ పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్ళు ఊరుతున్నారని ఆరోపించారు. కవిత ఆరోపణలకు స్పందించని హరీష్ రావు సీఎం ఆరోపణలకు మాత్రం వెంటనే స్పదించడం విశేషం.

సీఎం ఆరోపణలకు హరీష్ రావు స్పందిస్తూ ఎప్పటికి నా గుండెల్లో కేసీఆర్, గులాబీ జెండా ఉంటాయని వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే హరీష్ రావు పై సోషల్ మీడియా లో రకరకాలుగా ప్రచారం సాగుతోంది. ఒకవైపు కవిత, మరోవైపు రేవంత్ రెడ్డి ని రాజకీయంగా లక్ష్యంగా చేసుకోవడంతో హరీష్ రావు ఒత్తిడికి గురవుతున్నారనే అభిప్రాయాలు గులాబీ శ్రేణులతో పాటు, రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
———————————

 

పొలిటికల్ బ్యూరో
సిహెచ్ పరశురాం
9603982983
——————————-

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.