NIGAMA MEDIA (P) LTD
16.5 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Thursday, September 10, 2026

Singareni : శాంతిగని పై ఏఐటీయూసీ ధర్నా

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Singareni : మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా సింగరేణి శాంతి గని పై సోమవారం కార్మిక గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా ఏఐటీయూసీ బెల్లంపల్లి ఏరియా బ్రాంచ్ సెక్రెటరి దాగం మల్లేష్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ…..

కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేయనున్న కార్మిక చట్టాల వలన కార్మిక వర్గానికి ఎంతో అన్యాయం జరుగుతుందని ఆయన ఆరోపించారు. కొత్త లేబర్ చట్టాలను వెంటనే కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలనీ ఆయన డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల హక్కులను కాపాడేది కేవలం ఒక్క ఏఐటీయూసీ అని అన్నారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను రద్దుచేస్తామంటే సహించేదిలేదన్నారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ పిట్ సెక్రటరీ మంతెన రమేష్ అధ్యక్షత వహించగా, శాంతీఖని మైన్ పిట్ సెక్రటరీ దాసరి తిరుపతి గౌడ్, రత్నం ఐలయ్య , వర్క్మెన్ ఇన్స్పెక్టర్లు మిట్టపల్లి రమేష్, మైన్స్ కమిటీ సభ్యులు రత్నం ప్రవీణ్, మహంకాళి సంతోష్, రామక్రిష్ణ, శ్రీకాంత్, సేఫ్టీ కమిటీ సభ్యులు, క్యాంటీన్ కమిటీ సభ్యులు, టెంపుల్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు , కార్మికులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.