NIGAMA MEDIA (P) LTD
13.3 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

Ex Mavoist : దరువు నుంచి దండకారణ్యంకు మావోయిస్టు బండి ప్రకాష్ పయణం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

డీజీపీ ఎదుట లొంగిపోయిన బండి ప్రకాష్
సికాస లో కార్యదర్శి హోదాతో పాటు రాష్ట్ర కమిటీ సభ్యుడు
కార్యదర్శి హోదాలో లొంగిపోయిన మొదటి మావోయిస్టు
ప్రకాష్ లొంగుబాటు సికాస కు పెద్ద దెబ్బ
కేంద్ర కమిటీ సభ్యుడి పదవి వద్దనుకొని లొంగిపోయిన ప్రకాష్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాస్తవ్యుడు ప్రకాష్

Ex Mavoist : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మందమర్రి వాస్తవ్యుడు బండి ప్రకాష్. మందమర్రి ఏరియా లోని వర్క్ షాప్ సింగరేణి గని కార్మికుడు బండి రామారావు కు ద్వితీయ సంతానం. చదివింది ఏడోతరగతి. ఏడో తరగతిలో అనుత్తీర్ణుడు కావడంతో చదువుపై ఆసక్తి చూపలేదు. స్నేహితులతో కలిసి ఎక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగితే అక్కడికి వెళ్లి తబలా, కంజర వాయిస్తూ కాలక్షేపం చేసేది. ఆ విదంగా దరువు వేయడంలో నైపుణ్యం ఉన్న బండి ప్రకాష్ చివరకు అప్పటి నక్సలైట్లు మందమర్రిలో పాటలు పడుతుంటే దరువు వేసే పరిస్థితి ఏర్పడింది. నక్సలైట్లు మందమర్రిలో ఎక్కడ పాట పాడుతుంటే బండి ప్రకాష్ అక్కడ దరువు వేయాల్సిందే. లేదంటే ఆయన వచ్చే వరకు పాట ఆగాల్సిందే. కాదంటే ఉపన్యాసంతో నక్సలైట్ల సమావేశం ముగిసేది. ఆ విదంగా బండి ప్రకాష్ అడవి బాట పయనం ఆయన వేసిన దరువు దండకారణ్యం వరకు కొనసాగింది. మంగళ వారం రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయాడు. ఆయనపై రూ : 20 లక్షల రివార్డు ఉంది. ” కోల్ బెల్ట్ న్యూస్ ” ఇదే నెల 15న బండి ప్రకాష్ లొంగిపోయినట్టుగా ముందస్తుగా ప్రత్యేక కథనం ద్వారా తెలిపింది.

మందమర్రిలో మావోయిస్టు బండి ప్రకాష్ ఇల్లు …….

—————————————————————–

లొంగిపోయిన సికాస మొదటి కార్యదర్శి…….
———————————————————
ప్రస్తుత మంచిర్యాల జిల్లా మందమర్రి వాస్తవ్యుడు మావోయిస్టు బండి ప్రకాష్ పార్టీ అనుబంధ సంఘం రాడికల్ స్టూడెంట్ యూనియన్, సికాస తో పాటు పార్టీ భాద్యతలు చేపట్టారు. అయన లొంగిపోయే నాటికీ సికాస కార్యదర్శి, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, ప్రెస్ టీం ఇంచార్జ్, నేషనల్ పార్క్ ఏరియా కార్యదర్శిగా బాధ్యతల్లో ఉన్నాడు. సికాస ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు కార్యదర్శి భాద్యతలు చేపట్టిన వారిలో లొంగిపోయిన మొట్ట మొదటి వ్యక్తి బండి ప్రకాష్ కావడం విశేషం. దాదాపుగా అందరు కూడా ఎన్కౌంటర్ లో చనిపోయిన వారే. నిర్బంధం నేపథ్యంలో సికాస తన ఉనికిని చాటుకోవడం కూడా ప్రస్తుతం కష్టమే. గతంలో సిగరెట్ అట్ట ముక్క పై ” కార్మికులు సమ్మెలో పాల్గొనాలి ” అని రాసి పంపితే సింగరేణి వ్యాప్తంగా సమ్మె జరిగేది. వెంట, వెంట కార్యదర్శి హోదాలో ఉన్నమావోయిస్టులు ఎన్కౌంటర్ లో చనిపోయారు. కానీ బండి ప్రకాష్ ఒక్కడు మాత్రమే 45 ఏళ్ల పాటు ఉద్యమానికే అంకితం అయ్యాడు. 2004 లో చర్చల కోసమే రావడం, చర్చలు విఫలం కావడంతో తిరిగి అడవి బాట పట్టాడు బండి ప్రకాష్.

కేంద్ర కమిటీ పదవి వదులుకొని …..
———————————————-
బండి ప్రకాష్ లొంగి పోడానికి ముందు లొంగుబాటుకు బదులుగా అరెస్ట్ చూపాలంటూ పోలీస్ శాఖను కోరినట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. అరెస్ట్ ద్వారా జనజీవన స్రవంతిలో కలిస్తేనే తనకు ఒక విలువ, గుర్తింపు వస్తుందనే ఆలోచనతోనే తన మనసులోని కోరికను పోలీస్ అధికారుల వద్ద వెల్లడించినట్టు తెలిసింది. అంతే కాదు ఉద్యమానికి ద్రోహం చేయలేదనే పేరు కూడా దక్కుతుంది. కానీ అందుకు అధికారులు ఒప్పుకోక పోవడంతో లొంగుబాటుకు సిద్దమైనట్టుగా సమాచారం. ఇది ఇలా ఉండగా బండి ప్రకాష్ మరొక ఆలోచన కూడా చేసినట్టు తెలిసింది. పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుల పదవులు చాలా ఖాళీగా ఉన్నవి. కేంద్ర కమిటీ సభ్యుడిగా నియామకం అయిన తరువాత ఆ హోదాలో లొంగిపోవాలని కూడా ఆలోచించినట్టు సమాచారం. కానీ నిర్బంధం నేపథ్యంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు, సికాస కార్యదర్శి హోదాలోనే లొంగిపోడానికి సిద్ధమయ్యాడని సమాచారం.

జైలు నుంచి బండి ప్రకాష్ పారిపోయింది ఇలా….
—————————————————————
తపాలాపూర్ భూస్వామి పితాంబరరావు హత్య కేసులో నిందితుడిగా ఉన్నముంజ రత్నయ్య కరీం నగర్ జైలు లో ఉన్నాడు. రాంనగర్ కుట్ర కేసులో నిందితుడిగా రాష్ట్ర కమిటీ సభ్యుడు నల్లా ఆదిరెడ్డి ముషీరాబాద్ సెంట్రల్ జైలు లో ఉన్నాడు. నిజామాబాద్ జైలు లో సికాస నేత మహమ్మద్ హుస్సేన్ ఉన్నాడు. మందమర్రిలో హత్యకు గురైన సీపీఐ నేత వీటి అబ్రహం కేసులో నిందితుడిగా బండి ప్రకాష్ వరంగల్ జైలు లో ఉన్నాడు. ఈ నలుగురిని కేసు విచారణ నిమిత్తం ఆదిలాబాద్ జైలు కు జూన్, 1988 న తీసుకు రావడం జరిగింది. తేదీ : 18-9-1988 న సాయంత్రం ఆరు గంటలకు భోజనం సరఫరా చేయడానికి సెంట్రీ ఈ నలుగురు ఉన్న గది తలుపు తీసాడు. ఆ క్రమంలో నలుగురిలో ఒకరైన బండి ప్రకాష్ సెంట్రీని అదిమిపట్టగా ఆ కానిస్టేబుల్ భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. నలుగురు అక్కడి నుంచి పారిపోయారు. అక్కడే ఉన్న రెండు తుపాకులను పట్టుకొని పారి పోతుండగా పక్కనే ఉన్న కలెక్టరేట్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లకు కూడా ఏమి జరుగుతుందో అర్థం కాలేదు. కలెక్టరేట్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు ప్రాధేయపడటంతో వారిని విడిచిపెట్టి ఆ నలుగురు పారిపోవడం అప్పుడు రాష్ట్రంలో పెద్ద సంచలనం అయ్యింది. ఆ విధంగా పారిపోడానికి ప్రధాన పాత్ర పోషించింది బండి ప్రకాష్ కావడం విశేషం.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.