Home » Eye camp : వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిభిరం

Eye camp : వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిభిరం

Eye camp : బీబీపేట మండల కేంద్రంలో ఆదివారం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో మండల పరిధిలోని గ్రామస్తులకు కంటి పరీక్షలు నిర్వహించారు. 162 మందికి వైద్య పరీక్షలు చేయగా 35 మందికి శస్త్ర చికిత్స అవసరం ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వారిలో బీబీపేట డాక్టర్ బచ్చు కృష్ణమూర్తి, డాక్టర్ పెద్ది శ్రీపతి, సిద్దిపేట కృష్ణ సాయి ఐ హాస్పిటల్ వారు ఉన్నారు.

ఈ కార్యక్రమంలో సెంటర్ ఫర్ సైట్ నిర్వాహకులు హరీష్, వాసవి క్లబ్ అధ్యక్షుడు నాగభూషణం, కోశాధికారి రెడ్డి శెట్టి నాగభూషణం, మాజీ డిప్యూటీ గవర్నర్ విశ్వ ప్రసాద్, అంతర్జాతీయ కోఆర్డినేటర్ భాశెట్టి నాగేశ్వర్, బైరయ్య, గాంధారి సిద్ధరాములు, పెద్ది నాగేశ్వర్, హరి ప్రసాద్, శ్రీనివాస్ ఉన్నారు. 

వీరితో పాటు నేత్ర వైద్య నిపుణులు గడిల విజయకుమార్, కిరణ్ కుమార్, మురికి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ బచ్చు కృష్ణ మూర్తి, డాక్టర్ పెద్ది శ్రీపతి, వైద్య బృందాన్ని వాసవి క్లబ్ నిర్వాహకులు, బీబీపేట మండల గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *