Home » Kampelli : ఆ ఎమ్మెల్యేకు నియోజకవర్గం వద్దు…మంత్రి పదవే ముద్దు

Kampelli : ఆ ఎమ్మెల్యేకు నియోజకవర్గం వద్దు…మంత్రి పదవే ముద్దు

Kampelli : మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకట స్వామి కి మంత్రి పదవిపై ఉన్న శ్రద్ద నియోజక వర్గం పై లేదని INTUC సింగరేణి విభాగం క్రమశిక్షణ కమిటీ చైర్మన్, కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు కాంపెల్లి సమ్మయ్య ఆరోపించారు. శనివారం ఆయన గోదావరిఖనిలో మాట్లాడుతూ తన వెనుక అతిపెద్ద సామజిక వర్గం ఉందని గొప్పగా రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ అధిష్టానం వద్ద చెప్పుకుంటున్నారని ఆరోపించారు. ఇదంతా కూడా కేవలం రాష్ట్రంలో మంత్రి పదవి కోసమేనని సమ్మయ్య ఈ సందర్బంగా ఆరోపించారు.

గత ముప్పై ఏళ్ల పాటు మంద కృష్ణ మాదిగ పోరాటాలు చేసిన నేపథ్యంలోనే వర్గీకరణ సాధ్యమైనది. దీనికి మద్దతుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ లో తీర్మానం చేస్తున్న సమయంలో ఎమ్మెల్యే వివేక్ వ్యతిరేకించారు. సుప్రీం కోర్ట్ తీర్పుకు కూడా కట్టుబడి ఉండకుండా ఎమ్మెల్యే వర్గీకరణను వ్యతిరేకించారని సమ్మయ్య ఈ సందర్బంగా ఆరోపించారు.

క్రమశిక్షణ గల నాయకుడిగా ప్రజల అభిమానాన్ని పొందుతున్న మంత్రి శ్రీధర్ బాబుపై ఎమ్మెల్యే వివేక్ తో పాటు ఎంపీ వంశీ నిందలు వేయడం మానుకోవాలన్నారు. ఎమ్మెల్యే వివేక్ ఇప్పుడు బీజేపీ లోకి వెళుతాడా ? బిఆర్ఎస్ లోకి వెళుతాడా అనే అనుమానాలు కూడా ప్రజల్లో ఉన్నాయన్నారు. వర్గవిభేదాలు మానుకొని దళితుల అభివృధ్ధి కోసం కృషి చేయాలని కాంపెల్లి సోమయ్య ఈ సందర్బంగా కోరారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *