Home » Vinod : అయన వైపే మొగ్గు చూపుతున్నకాంగ్రెస్ పెద్దలు

Vinod : అయన వైపే మొగ్గు చూపుతున్నకాంగ్రెస్ పెద్దలు

vinod : తెలంగాణ రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణ వేడి ఇంకా చల్లారనేలేదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోసం కళలు కంటూనే ఉన్నారు. ఎవరికి వారే ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఢిల్లీ చుట్టూ ప్రదక్షణలు చేస్తూనే ఉన్నారు. తెగే వరకు లాగుతా అన్నట్టుగా మంత్రి వర్గ విస్తరణ జరిగే వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటానంటున్నారు కొందరు ఎమ్మెల్యేలు. ఉన్నవి ఆరు పదవులు. ఆశించేవారు ఇరువై మంది ఎమ్మెల్యేలు.

ఇది ఇలా ఉండగా పార్టీ వర్గాల నుంచి వచ్చిన విశ్వసనీయ సమాచారం ఏమిటంటే…. మంత్రి పదవి ఆశిస్తున్న వారిలో గడ్డం వినోద్ సీనియర్ నాయకుడు. సౌమ్యుడు. వివాదాలకు దూరంగా ఉంటారు. ఎలాంటి ఆరోపణలు కూడా లేవు. ప్రభుత్వ నిఘావర్గాలు కూడా వినోద్ కె అనుకూలంగా నివేదిక పంపినట్టుగా సమాచారం. కాబట్టి వినోద్ కు మంత్రి పదవి కట్టబెడితే మంచిర్యాల జిల్లా లో పార్టీ కి ఎలాంటి రాజకియ తలనొప్పి ఉండదనే ఉద్దేశ్యంతో అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా పార్టీ వర్గాల సమాచారం.

అదే విదంగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుకు ప్రభుత్వ విప్ పదవి అప్పగిస్తే ఎలా ఉంటదని కూడా పార్టీ ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పార్టీకి ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు. ఆ రెండు జిల్లాల్లో పార్టీ ఉనికిని కాపాడుకోవాలంటే బొజ్జు కు విప్ పదవి ఇస్తే నాయకులకు, కార్యకర్తలకు ఆయన అండగా ఉంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ లో బీజేపీ నాలుగు ఎమ్మెల్యే, ఒక ఎంపీ స్థానంతో మంచి ఊపు మీద ఉంది. ఆ ధాటిని తట్టుకోవాలంటే పార్టీ కి ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుకు విప్ పదవి ఇవ్వాలనేది పార్టీ లో కొందరి పెద్దల వాదన. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి బుగ్గ కారు అదృష్టం ఎవరికీ దక్కనుందో వేచి చూడాల్సిందే. 

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *