Health : బెల్లంతో వివిధ రకాల పిండి వంటలు చేసుకుంటాం. బెల్లంతో దేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు. కానీ ఆ బెల్లం తినడం వలన శరీరానికి ఎంత మేలు జరుగుతుందో చాలా మందికి తెలియదు. బెల్లం గురుంచి ఆరోగ్య నిపుణులు ఈ విదంగా చెబుతున్నారు.
బెల్లం తినడం వలన రక్త హీనతను తగ్గిస్తుంది. హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి, రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. బీపీని అదుపు చేయడంలో సహాయ పడుతుంది. ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. ఎముకలకు బలం చేకూరుతుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఉపయోగకరంగా ఉంటుంది. షుగర్ వ్యాధి ఉన్న వ్యక్తులు బెల్లాన్ని తీసుకోరాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇందులో ఎక్కువగా ఐరన్, ఫాస్ఫరస్ ఉంటాయి. ఇవి హిమోగ్లోబిన్‌ను తయారు చేస్తాయి. రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఇందులో ఉంది. ఇది శరీరంలో రక్తహీనతను తగ్గించి, ఎముకలకు బలం చేకూరుస్తుంది. ఆరోగ్యకరమైన శరీరాన్ని నిర్మించడంలో దోహదం చేస్తుంది. బెల్లం తినడం వలన శ్వాస సంబంధిత సమస్యలు పరిస్కారమవుతాయి. గొంతు నొప్పి తగ్గుతుంది. మలబద్దకం సమస్య ఉన్నవారి సమస్య పరిస్కారం అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.