Home » Chanakyudu : ఆ గుణాలు ఉన్న వారింటిలో భోజనం చేయవద్దంటున్న చాణక్యుడు

Chanakyudu : ఆ గుణాలు ఉన్న వారింటిలో భోజనం చేయవద్దంటున్న చాణక్యుడు

Chanakyudu : చాణక్యుడు ఆర్థిక సూత్రాలు చెప్పడంలో మహా మేధావి. అదే విదంగా నీతి సూత్రాలు కూడా చెప్పడంలో తనకు తానే సాటి. అతని బోధనలు పాటిస్తే ఫలితం ఉంటుందని అయన సూత్రాలు అనుభవించిన వారు చెబుతున్నారు. బంధువులు, స్నేహితులు సరదాగా వాళ్ళ ఇళ్లలోకి భోజనానికి పిలవడం సహజం. కానీ ఎటువంటి వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళకూడదు అనే విషయాన్ని చాణక్యుడు ఈ విదంగా చెబుతున్నాడు.

ముఖ్యముగా దొంగతనాలకు పాల్పడే వ్యక్తుల ఇళ్లలో భోజనం చేయరాదు. అటువంటి వారి ఇంటికి వెళితే వారి ప్రభావం పడుతుంది. అదే విదంగా సత్ప్రవర్తన లేని మహిళల ఇంటికి కూడా భోజనానికి వెళ్లరాదని చాణక్యుడు తన నీతి సూత్రాల్లో స్పష్టం చేశాడు. దీర్ఘకాలిక వ్యాధులతో భాదపడుతున్న వారి ఇంటిలో భోజనం చేసిన నేపథ్యంలో ఆ వ్యాదులు అంటుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అదే విదంగా అధిక వడ్డీలు ఇచ్చే వారి ఇంటితో పాటు అప్పులు ఉన్నవారు ఇంటికి కూడా భోజనానికి వెళ్ళరాదు. మంచి గుణవంతుడై ఉండి, సత్ప్రవర్తన లేని వారితో స్నేహం చేస్తున్న వ్యక్తి ఇంటికి కూడా భోజనానికి వెళ్లరాదని చాణక్యుడు తన నీతి సూత్రాల్లో వివరించడం జరిగింది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *