Home » Prabas : డార్లింగ్…. డ్రగ్ అవసరమా ?

Prabas : డార్లింగ్…. డ్రగ్ అవసరమా ?

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఇప్పుడు అయన కెమెరా ముందుకు వచ్చారు. కొత్తగా తన అభిమానులకు కనిపించబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలనకు ప్రత్యేక చొరవ తీసుకోంది. కఠినమైన నిర్ణయాలు చట్టప్రకారం చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వానికి తన వంతు భాద్యతగా రెబల్ స్టార్ ముందుకు వచ్చారు. తాను కూడా డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టారు. దానికి సంబందించిన వీడియో ను కూడా విడుదల చేశారు. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఏమున్నదంటే….

జీవితంలో మనకు కావలసినంత సంతోషం దొరుకుతుంది. సరిపడేంత ఎంటర్టైన్మెంట్ అందుబాటులో ఉంది. మనలను ప్రేమించే మనుషులు ఎందరో ఉన్నారు. మనకోసం బతికే వాళ్ళు మన దగ్గరే ఉన్నారు. అటువంటప్పుడు మన జీవితాలను నాశనం చేసే ఈ డ్రగ్స్ మనకు అవసరమా …. డార్లింగ్… డ్రగ్స్ కు నో చెప్పండి డార్లింగ్ అంటూ ప్రభాస్ తన వీడియో లో సందేశాన్ని వివరించారు.

మీకు తెలిసిన వాళ్లు, మీ బంధువులు, స్నేహితులు ఎవరైనా సరే డ్రగ్స్ కు బానిసైతే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వండి. వారిని బాగుచేసి దేశానికి సేవ చేసే విదంగా తయారు చేద్దాం అంటూ ప్రభాస్ షేర్ చేసిన వీడియో ఆకట్టుకుంటోంది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *