NIGAMA MEDIA (P) LTD
18.7 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Monday, September 14, 2026

Telangana : తెలంగాణ ప్రజాప్రతినిధులకు శుభవార్త

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Telangana : గత ఏడాది నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధులు తిరుమల, తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళితే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణ నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ లు దర్శనం వెళ్లినా కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదే విదంగా వారు పంపిన సిపార్సు లేఖలను సైతం టీటీడీ అధికారులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు సమస్య వివరించారు.

ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ లు కుటుంబ సభ్యులతో దర్శనం కోసం వచ్చినప్పుడు నిబంధనలు పాటించాలని ఆదేశిస్తూ ఏపీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. దింతో తెలంగాణ ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఒక ప్రజాప్రతినిధి నుంచి వారానికి 4 సిఫార్సు లేఖలను అనుమతించే విధంగా ఏపీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. అదే విదంగా వారానికి 2 బ్రేక్‌ దర్శనాలతో పాటు మరో రెండు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించిన లేఖలను కూడా అనుమతించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఒక సిపార్స్ లేఖకు ఆరుగురు భక్తులు దర్శనం చేసుకునే విధంగా తెలంగాణ ప్రజాప్రతినిధులకు అవకాశం లభించింది.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.