Oil : వంట నూనెలు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. కానీ నూనెతో చేసిన పదార్థాలు, నూనెలో వేయించిన పదార్థాలు తింటే ఆరోగ్యానికి అంతగా మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నూనె ఎక్కువగా వాడటం వలన గుండె జబ్బులు వస్తున్నాయని కూడా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ ఆ నాలుగు రకాల నూనెలు వంటలో ఉపయోగిస్తే గుండె జబ్బులు రావని కూడా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో కూడా వాటి గురించి తెలుసుకుందాం.
సన్ ఫ్లవర్ ఆయిల్ : ఈ నూనెలో విటమిన్ ఇ ఉంటుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. గుండెకు మేలు చేసే యాంటీఆక్సిడెంట్ కూడా ఇందులో ఉంటుంది.
సోయాబీన్ ఆయిల్ : సోయాబీన్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లు అధికంగా ఉంటాయి. అదేవిదంగా గాయాలను నయం చేసే గుణాలు ఉన్నాయి. సోయాబీన్ ఆయిల్ లో ఉండే ఫ్లేవనాయిడ్స్, పాలీసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు గుండె కు ఎంతో మేలు చేస్తాయి.
కనోలా ఆయిల్ : అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు ఈ నూనె వాడితే ఉపయోగమవుతుంది. ఇందులో ఉండే ఫ్యాట్ సీరం చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది.
ఆలివ్ ఆయిల్ : ఈ నూనెలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్నాయి.ఇది కొలెస్ట్రాల్ ను నివారిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు సైతం ఉన్నాయి. ఈ నూనె ఆక్సీకరణ ఒత్తిడి వల్ల క్యాన్సర్, డయాబెటిస్, పార్కిన్సన్స్, అల్జీమర్స్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.