Mirchi : చూడటానికి ఆకుపచ్చ రంగులో చూడ ముచ్చటగా ఉంటాయి పచ్చి మిరప కాయలు. కొరికి చుస్తే …ఆ ఆమ్మో ఎంత గాటో అంటాం. కానీ ఆ పచ్చి మిరపకాయలు నిరంతరం తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఈ పచ్చి మిరపకాయల్లో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఐరన్, పొటాషియం, విటమిన్లు సి, విటమిన్లు, ఖనిజాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవన్నీ కూడా శరీర పనితీరుకు ఎంతో ఉపయోగపడుతాయి.
మిరపకాయలలో ఉండే క్యాప్సైసిన్ జీవక్రియను వేగవంతం చేస్తుంది. వేగవంతమైన జీవక్రియ వలన నిల్వ చేయబడిన కొవ్వు విచ్ఛిన్నమై బరువు తగ్గుతుంది. దీనిలో విటమిన్ B5 ఉండటంతో కొవ్వు ఆమ్లాల విచ్ఛిన్నం సులభమవుతుంది. వీటిలో కేలరీలు కూడా ఉండవు. విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది.
దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ సి చర్మాన్ని బిగుతుగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరానికి అవసరమైన కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది. శరీరంలో ముడతలు, మచ్చలు, మొటిమలు, దద్దుర్లు రాకుండా నిరోధిస్తుంది. దీనిలో ఉండే విటమిన్ ఇ చర్మానికి మేలు చేస్తుంది.