Nagababu : ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి, ప్రముఖ తెలుగు సినీ నటుడు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును మంత్రి పదవికి కూటమి ప్రభుత్వం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే నాగబాబుకు ఏ మంత్రి మండలిలో ఏ శాఖను కేటాయిస్తారనేది కూడా సినీ పరిశ్రమతో పాటు, ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఇప్పుడు ఆ చర్చకు దాదాపుగా తెర పడినట్టేనని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ప్రస్తుతం జనసేన పార్టీ నాయకుడు కందుల దుర్గేష్ సినిమాటో గ్రఫీ, తోపాటు టూరిజం శాఖను కూడా నిర్వహిస్తున్నారు. దుర్గేష్ సొంత పార్టీ నాయకుడు కావడంతో పాటు, పవన్ కళ్యాణ్ కు కూడా నమ్మిన వ్యక్తి. కాబట్టి దుర్గేష్ కూడా పవన్ కళ్యాణ్ మాట కాదనలేరు. కందుల దుర్గేష్ వద్ద ఉన్నటువంటి రెండు శాఖల నుంచి సినిమాటో గ్రఫీ శాఖను నాగబాబు కు అప్పగించే అవకాశాలు కనబడుతున్నాయి. కూటమి నాయకులు కూడా దాదాపుగా నాగబాబుకు సినిమాటో గ్రఫీ శాఖను ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
నాగబాబుకు సినిమాటో గ్రఫీ శాఖను కేటాయిస్తే సినీ పరిశ్రమకు ప్రభుత్వానికి వారధిగా సమర్థ వంతంగా పనిచేస్తారనే అభిప్రాయం వ్యక్తం కావడం విశేషం. మరో రెండు, మూడు రోజుల్లో ఈ అంశం ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి.