Home » Police : ఇటుక బట్టి పిల్లలకు ఇంటికే విద్య… సీపీ. ఎం శ్రీనివాస్

Police : ఇటుక బట్టి పిల్లలకు ఇంటికే విద్య… సీపీ. ఎం శ్రీనివాస్

Police : రామగుండం కమిషనరేట్ పరిధిలోని ఇటుక బట్టి కార్మికుల పిల్లలకు ఇంటికే కార్పొరేట్ విద్యను అందించడానికి సీపీ ఎం శ్రీనివాస్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇటుక బట్టీలల్లో పనిచేస్తున్న కార్మికుల పిల్లలు పదుల సంఖ్యల్లో తల్లి తండ్రులతోనే బట్టీలల్లో పనిచేస్తున్నారు. ఆ పిల్లలంతా కూడా చదువుకు దూరమై కార్మికులుగా తయారవుతారు. ఇది వారి జీవితాలను నాశనం చేస్తుందనే భావనతో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ నడుం బిగించారు. వారి కోసం ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేశారు.

ఇటుక బట్టీలల్లో పనిచేస్తున్న కార్మికులంతా కూడా ఒడిస్సా నుంచి వలస వచ్చిన వారే. కాబట్టి వారి కోసం ఒడిస్సా భాష లోనే చదువు నేర్పించాలని సీపీ శ్రీనివాస్ నిర్ణయం తీసుకున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా ఒడిస్సా నుంచి ఉపాధ్యాయులను నియామకం చేశారు. శుక్రవారం ఇటుక బట్టి కార్మికుల పిల్లల కోసం ప్రత్యేకంగా పాఠశాలను ఏర్పాటు చేశారు. వారి మాతృ భాషలోనే చదువు నేర్పించడానికి ఏర్పాట్లు చేయడం విశేషం.

ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ప్రాథమిక విద్య ను వారి నివాస ప్రాంతాల్లో బోధించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు సీపీ శ్రీనివాస్. ఆ పిల్లల చదువుకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగ్ లు సైతం ప్రతి విద్యార్థికి అందజేశారు. ఈ సందర్బంగా సీపీ. ఎం. శ్రీనివాస్ విద్యార్థులను, వారి తల్లి దండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ చదువు యొక్క ప్రాముఖ్యతను వివరించారు. పిల్లల చదువుకు
అవసరమైన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడానికి పోలీస్ శాఖ సిద్ధంగా ఉందన్నారు. చదువు విషయంలో ఎలాంటి అవసరం వచ్చిన అందుబాటులో ఉన్న పోలీస్ అధికారులను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనరేట్ పరిధిలోని ఎస్సై లు, సిఐ లు, ఏసీపీ, డీసీపీ లు, సిబ్బంది పాల్గొన్నారు.

 

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *