Goat Milk : ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి కొందరు ప్రతిరోజూ ఆవు, గేదె పాలు తాగుతుంటారు. కానీ చాలా మందికి మేక పాలు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదనే విషయం తెలియదు. మేక పాలు తాగితే మన శరీరానికి ఎన్ని లాభాలు ఉన్నాయో చాలా మందికి తెలియదు. మేక పాల గురించి తెలిస్తే ప్రతిరోజూ తాగకుండా ఉండలేరు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
ప్రతిరోజూ మేకపాలు తాగడం వలన రక్తపోటు అదుపులో ఉంటుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది. రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. కణాలు అభివృద్ధి చెందుతాయి. శరీరానికి కావాల్సిన పోషకాలు సరిగా అందుతాయి. డెంగ్యూ సోకిన వారికి మేక పాలు తాగిస్తే రక్తంలో ప్లేట్ లేట్స్ పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు.
ఆవు, గేదె పాల కంటే మేక పాలల్లో ప్రోటీన్ లు ఎక్కువగా ఉంటాయి. మేక పాలు సులభంగా జీర్ణమవుతాయి. మేక పాలలో ఉండే బయోఆర్గానికి సోడియం శరీరానికి చాలా ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ ఒక కప్పు మేక పాలు తాగడం వలన 30 శాతం ఫాటీ ఆమ్లాలను శరీరం అధికంగా పొందుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.