Munaga Leaf : ముఖం అందంగా ఉండటానికి ఎన్నో చిట్కాలు ఉన్నాయి. ముఖం అందంగా తయారుకాడానికి చాలా మంది బ్యూటీ పార్లర్ పై ఆధారపడుతున్నారు. వైద్య రంగంలో కూడా అనేక విధాలుగా చెబుతున్నారు. కానీ ఆ ఆకుతో మరింత అందంగా తయారు కావడానికి అవకాశాలు ఉన్నాయని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఆ ఆకు గురించి ఇప్పుడు తెలుసుకుందాం…..
ఆ ఆకు పేరు మునగ ఆకు. చాలా మందికి మునగకాయ గురించే తెలుసు. కానీ ఆ ఆకు, పొడితో ముఖాన్ని మరింత అందంగా తయారు చేసుకోవచ్చనే విషయం తెలియదు. మునగ ఆకు, మునగ నూనె, ఆకు పొడి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. జుట్టును సంరక్షించింది.
మునగ ఆకుల్లో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్-ఎ, సి, బి కాంప్లెక్స్, బీటా-కెరోటిన్, అమైనో యాసిడ్స్, ఫినోలిక్‌లతో పాటు, 40 కి పైగా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.
మునగాకు పొడి మొటిమలు, మచ్చలు, ముడతలను తగ్గిస్తుంది. ఇందులో విటమిన్- సి ఏడురెట్లు ఎక్కువ\గా ఉంటుంది. మంగు మచ్చల్నీ నియంత్రిస్తుంది. చెంచా మునగాకు పొడికి రెండు చెంచాల పెరుగులో కలిపి ముఖానికి పట్టించాలి. అర్ధ గంట తరువాత చల్లని నీటితో శుభ్రం చేస్తే ముఖం కాంతివంతం అవుతుంది.
మునగ కాయ గింజల్లో విటమిన్ ఎ, సి, ఇ లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మానికి కావల్సినంత తేమను అందించి మృదువుగా తయారు చేస్తాయి. మునగ గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీరాడికల్స్‌తో పోరాడుతాయి. అంతేకాదు వృద్ధాప్య ఛాయలను కూడా తగ్గిస్తాయి.