Home » Sugar : శర్కర, బెల్లం…. వీటిలో ఏది మంచిది.

Sugar : శర్కర, బెల్లం…. వీటిలో ఏది మంచిది.

Sugar : సాధారణంగా ప్రతి ఇంటిలో బెల్లం, శర్కర నిల్వ ఉంటాయి. రెండింటిని వాడుతారు. ఎక్కువగా శర్కరను చాయ్, కాఫీ లో వాడుతారు. స్వీట్ తయారీలో కూడా శర్కర వాడుతారు. అదే విదంగా బెల్లం కూడా ప్రసాదం, స్వీట్ లో కూడా వాడుతారు. కానీ బెల్లం, శర్కర లో శరీరానికి ఏది మంచిదంటే రెండూ మంచివే అంటారు. కానీ శరీరానికి బెల్లం ఎక్కువగా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది. హీమోగ్లోబిన్ స్థాయిని పెంచి రక్తహీనత సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. అలసటగా ఉన్నప్పుడు కొద్దిగా బెల్లం తింటే శరీరానికి ఉత్సాహం వస్తుంది. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల శరీరాన్ని హానికరమైన టాక్సిన్స్ నుంచి రక్షిస్తుంది..

గ్లూకోజ్, సుక్రోజ్ ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. జీర్ణ ఎంజైమ్‌లను ఉత్తేజపరచి మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. కాలేయాన్ని శుభ్రపరచి ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణక్రియ మెరుగవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ డయాబెటిస్ ఉన్నవారు బెల్లం ఎక్కువగా తింటే అది కిడ్నీలపై ఒత్తిడిని పెంచి దీర్ఘకాలికంగా సమస్యలను తెస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *