bjp leaders : 2024 అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరకు కూడా భారతీయ జనతా పార్టీ కి ఏపీ లో తన కంటూ ఒక ఎమ్మెల్యే గాని, ఒక ఎంపీ గాని లేరు. అటువంటి పార్టీకి ఎనిమిది అసెంబ్లీ స్థానాలతో పాటు, రెండు పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులు విజయ పతాకాన్ని ఎగురవేశారు. అటువంటి పార్టీ ని ప్రజలు ఆదరిస్తే, కొందరు నేతలు రాసలీలలు ఆడుతూ పార్టీ పరువును బజారున కలుపుతున్నారు.
పార్టీకి మాతృ సంస్థ సంఘ్ పరివార్. సంఘ్ పరివార్ నుంచి వచ్చిన వారు నూటికి నూరు శాతం క్రమశిక్షణతో ముందుకు వెళుతారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులే పార్టీ కి తలవంపులు తెచ్చిపెడుతారనే పేరుంది. ఇప్పుడు ఏపీ లో అదే జరుగుతోంది. ఇద్దరు నాయకుల రాసలీలలు పార్టీకి తలనొప్పి తెచ్చి పెట్టాయి. వీరి బాగోతంపై విచారణ చేపట్టి నివేదిక పంపాలని ఢిల్లీ పెద్దలు ఆదేశించారు.
గతంలో ఓ మహిళ వైసీపీ నేతతో జరిపిన సరసాలు జరిపింది. ఇప్పుడు ఆ మహిళ గుంటూరు జిల్లా బీజేపీ పెద్ద మనిషితో రాసలీలలు ఆడటానికి సిద్దమైనది. గుంటూరు పెద్దమనిషి కంటే ముందుగానే పలువురు కాషాయం పెద్దలతో విందు, మందు ఆరగించి సంతోష పరిచింది. ఇద్దరి మధ్య ఉండాల్సిన ఆ వీడియో కాస్త జనంలోకి వెళ్ళింది.
గుంటూరు జిల్లాకు చెందిన మరో కాషాయం పెద్దన్న తన అందం చూడంటూ బట్టలు విప్పుకొని చేసిన నృత్యాలు మొబైల్ లో మోగిపోతున్నాయి. సంఘ్ పరివార్ లో ఇలాంటి చేష్టలను సంఘ్ పెద్దలు సమ్మతించరు. వీడియో రూపంలో నిజా, నిజాలు తెలిసిపోయాయి. ఇంకా దీనిపై విచారణ, నివేదికలు అంటూ ఆదేశాలు ఇవ్వడంతో ఏపీ కాషాయం శ్రేణులు, సంఘ్ పరివార్ పెద్దలు పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.