MLC kavitha : ఎమ్మెల్సీ కవిత తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ కూతురు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన అనంతరం పదేళ్లు గులాబీ పార్టీ అధికారంలో ఉంది. సొంత మీడియా అనడంకు బదులు ఇంటి మీడియా అంటేనే బాగుంటది. ఆ పదేళ్ల కాలంలో ఆమె ఎక్కడ ఉంటె అక్కడ ఇంటి పత్రిక, మీడియా రెక్కలు కట్టుకొని వాలేవి. లైవ్ లో కార్యక్రమాలను చూపించేవారు.
అంతే కాదు కవిత ఎక్కడికి వెళ్లిన అక్కడి నేతలు ఘనంగా స్వాగతం పలికేవారు. ఎందుకంటే సీఎం కూతురు. కాబట్టి గల్లీ నుంచి మొదలు కొని రాష్ట్ర స్థాయి నాయకుడి వరకు చెమటలు కక్కుకుంటూ వచ్చి కవిత స్వాగతం పలికేవారు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసేవారు. సీఎం కూతురు వస్తున్నారంటే ఒకవైపు మీడియా, మరోవైపు నాయకుల స్వాగతం, ఇంకోవైపు ఏర్పాట్లు జరిగేవి.
ఆదివారం హైదరాబాద్ లో అమ్మవారికి ఎమ్మెల్సీ కవిత బోనం సమర్పించారు. ఆ సమయంలో అక్కడికి ఆమె ఇంటి మీడియా అందనంత దూరంలోనే ఉంది. ఎప్పుడు స్వాగతం ఏర్పాట్లు చేసే తలసాని శ్రీనివాస్ యాదవ్ అడ్రెస్స్ లేరు. కనీసం అయన కొడుకు కూడా కనబడలేదు. ఉద్యమం సమయంలో ఆంధ్ర మీడియా అంటూ దుమ్మెత్తి పోసిన కవితకు ఎట్టకేలకు ఆదివారం ఆ ఆంధ్ర మీడియా నే దిక్కైనది. ఇప్పటినుంచి కవిత ఏ కార్యక్రమం చేపట్టినా నిందలు మోసిన మీడియా నే ఆమె కార్యక్రమాలను ప్రసారం చేస్తుంది.