NIGAMA MEDIA (P) LTD
13.3 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

CCI Jobs : CCI లో ఉద్యోగాలు…వేతనం రు : 1.40 లక్ష

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

CCI Jobs : కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (CCI) లిమిటెడ్‌ లో ఖాళీగా ఉన్న 214 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. నవీ ముంబైలోని ప్రభుత్వ రంగ సంస్థ కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (CCI) లిమిటెడ్‌ లో నియామకం అయిన వారికి భవిష్యత్తులో మంచి పదోన్నతులు కూడా లభిస్తాయి. ప్రారంభంలోనే అన్ని అలవెన్సులు కలిపి వేతనం రు 1.40 లక్ష వరకు వస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఉద్యోగ భద్రత కూడా ఉంటుంది.

ప్రకటించిన నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్‌ మేనేజర్, మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనది. అర్హులైన దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ జులై 2,2024 గా నిర్ణయించారు. పీజీ, సీఏ/ సీఎంఏ, బీఎస్సీ, బీకాం, లా డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి. అనుభవం తప్పనిసరిగా యాజమాన్యం పేర్కొంది.

1) జూనియర్‌ కమర్షియల్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు 120 : 50 శాతం మార్కులతో బీఎస్సీ అగ్రికల్చర్‌ ఉత్తీర్ణత. ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులు 45 శాతం మార్కులు సాధించి ఉండాలి.
2) జూనియర్‌ అసిస్టెంట్‌ (అకౌంట్స్‌ పోస్టులు 40 : 50 శాతం బీసీ, జనరల్, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
3) జూనియర్‌ అసిస్టెంట్‌ (జనరల్‌) పోస్టులు 20 : అగ్రికల్చర్‌ బీఎస్సీ డిగ్రీ లో 50 శాతం, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులు 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
4) మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (అకౌంట్స్‌ పోస్టులు 20 : సీఏ లేదా సీఎంఏ ఉత్తీర్ణులై ఉండాలి.
5) మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (మార్కెటింగ్‌) పోస్టులు 11 : అగ్రికల్చర్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ/ ఎంబీఏతో సమానమైన వ్యవసాయ సంబంధిత మేనేజ్‌మెంట్‌ కోర్సు చదివి ఉండాలి.
6) జూనియర్‌ అసిస్టెంట్‌ (హిందీ ట్రాన్స్‌లేటర్‌): 01 పోస్టు: డిగ్రీ, పీజీ లో హిందీ స్పెషలైజేషన్. ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. హిందీ, ఇంగ్లిష్ ట్రాన్స్‌లేషన్ వచ్చి ఉండాలి. సంస్కృతంతోపాటు ఇతర భారతీయ భాషలపై కూడా అవగాహన తప్పనిసరి. జర్నలిజం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో కూడా అనుభవం తప్పనిసరి.
7) అసిస్టెంట్‌ మేనేజర్‌(అఫీషియల్‌ లాంగ్వేజ్‌): పోస్టు 1 : కనీసం 50 శాతం మార్కులతో పీజీ (హిందీ) లో ఉత్తీర్ణత. డిగ్రీ లో ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. హిందీ ట్రాన్స్‌లేషన్ లో కనీసం ఏడాది అనుభవం తప్పనిసరి.
8) అసిస్టెంట్‌ మేనేజర్‌ (లీగల్‌): 01 పోస్టు: కనీసం 50 శాతం మార్కులతో LLB లేదా LLM డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఏదయిన కోర్ట్ లో న్యాయవాదిగా కనీసం ఏడాది పనిచేసి ఉండాలి. ఏదైనా న్యాయసేవా సంస్థల్లో పనిచేసిన అనుభవమయినా తప్పనిసరిగా ఉండాలి.

అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగానికి 32 ఏళ్లు, ఇతర ఉద్యోగాలకు 30 ఏళ్లు మించి ఉండరాదు. గరిష్ఠ వయసులో ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ లకు మూడేళ్లు, వికలాంగులకు 10 నుంచి 15 ఏళ్లు, మాజీ సైనిక్ ఉద్యోగులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది. జనరల్ అభ్యర్థులు రూ.1500; ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మాజీ సైనిక్ ఉద్యోగులు రూ.500 చెల్లించాలి. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష లో సాధించిన మార్కుల ఆధారంగా సెర్టిఫికెట్లు పరిశీలిస్తారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి నియామకం చేసుకుంటారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.