ఇందిరమ్మ ఇళ్లతో నిరుపేదలకు సొంతింటి కల సాకారం
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): ఇందిరమ్మ ప్రభుత్వంతోనే నిరుపేదలకు పూర్తి సబ్సిడీతో ఇళ్లు మంజూరై, సొంతింటి కల నెరవేరుతుందని సర్పంచ్ ఐరేని నర్సయ్య అన్నారు. దోమకొండలో అచ్చె రవి–కృష్ణవేణి, కర్రె రజని–శ్యామ్, వడ్ల రాజమణి–శ్రీనివాస్‌లకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఐరేని నర్సయ్యతో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొని లబ్ధిదారులను అభినందించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ సభ్యుడు తీగల తిర్మల్ గౌడ్ లబ్ధిదారులకు బట్టలు అందజేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ అనంతరెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు సీతారాం...