మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలి

నెలకు రూ.10 వేల జీవనభృతి అందించాలి ముదిరాజ్ మహాసభ కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి): ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లిలో టీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలు సిరవెన్న స్వప్న ముదిరాజ్ ఆధ్వర్యంలో మత్స్యకారుల వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. పెద్దపల్లి జిల్లాలోని వివిధ మత్స్యకారుల సొసైటీల అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. మత్స్యకారుల కుటుంబాలకు నెలకు రూ.10 వేల జీవనభృతి...